బిగ్ బాస్ సీజన్-8 టాప్-5 లో ప్రేరణ ఒక్కతే లేడి కంటెస్టెంట్. పెళ్ళి తర్వాత కూడా ఎంతో సాధించొచ్చని ప్రూవ్ చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తన జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. అది చూసి బిబి ఆడియన్స్ అంతా ఫిధా అయ్యారు.
ప్రేరణ గురించి బిగ్ బాస్ తన మాటల్లో ఏం చెప్పాడో ఓసారి చూసేద్దాం. ప్రేరణ.. నిన్నకి నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే.. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది.. అంతా నేనే అనే అహం పడగొడుతుంది.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది.. పసిపాప లాంటి అమాయకత్వంతో మీరు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికి దగ్గర చేసింది.. కానీ వారు మీకు నేర్పిన గుణపాఠాలే స్నేహం నుంచి ఆటని వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. ప్రేరణ బిగ్‌బాస్ ఇంట్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్.. ఓటమిని ఒప్పుకోని మీ తత్త్వమే మిమ్మల్ని చాలా సార్లు గెలుపు అంచుల వరకు తీసుకెళ్లింది. అదే మిమ్మల్ని మెగా చీఫ్‌ని చేసింది.
కానీ అప్పటి నుంచి మీకు కష్టాలు పెరిగాయి.. మీరు మెగా చీఫ్‌గా తన మన అనే భేదాలు లేకుండా మీ కర్తవ్యాలని సవ్యంగా నిర్వర్తించారు.. మీ బాధ్యత కోసం వెన్ను వంచని మీ మనస్తత్వం మిమ్మల్ని అందరు నిందించేలా చేసింది.. తిప్పలు తెచ్చింది.. ప్రేరణ.. ఇంటిసభ్యుల దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ అయి ఉండొచ్చు కానీ బిగ్‌బాస్ దృష్టిలో మీరు బెస్ట్ మెగా చీఫ్.. తప్పు నిజంగా జరిగితే సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా సరే వాళ్లని నామినేట్ చేయడానికి మీరు వెనుకాడలేదు.. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవాళ్లకి చెమటలు పట్టించింది..ఆ లక్షణమే టాప్-5లో నిలిచిన ఒకే ఒక్క మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది.. పెళ్లైన మహిళలు కూడా ఎంతో సాధించొచ్చని మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాను. బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దామంటూ ప్రేరణ జర్నీ వీడియో చూపించగా.. ఇక బిగ్‌బాస్ మాటలకి ప్రేరణ ఫుల్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.